KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

BRS KTR fires on CM Revanth Reddy Over Rythu Bharosa(X)

Hyd, January 3: ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని లంగా మాటలు మాట్లాడుతున్నారు అని దుయ్యబట్టారు.

పత్తి పంట, కంది పంట, మిర్చి పంట, చెరుకు పంటలు పండించే రైతులు సంవత్సరానికి ఒకటే పంట పండిస్తారు.. పోడు రైతులు సంవత్సరానికి ఒక్కటే పంట పండిస్తారు అన్నారు. పామాయిల్, మామిడి, బత్తాయి, నిమ్మ తోటలన్నీ ఒకటే పంట కిందికి లెక్క కడుతున్నారు అన్నారు. వానాకాలం పంట కోటిన్నర ఎకరాల్లో పెడితే, యాసంగిలో దాంట్లో సగం ఎకరాల్లో పంట సాగు అవుతుందన్నారు.

రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని సగం మంది రైతులకు ఇవ్వకుండా ముంచుదామని చూస్తున్నారు అని..మతి తప్పిన బేమాన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..కల్వకుంట్ల కుటుంబమంతా కేసుల మయం, త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న కడియం 

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఏ ఊర్లో రైతు కూలీలు ఎంత మంది ఉన్నారో, వాళ్లకి ఎంతెంత బాకీ పడ్డావో ఆ లిస్ట్ పెట్టు అన్నారు. రైతుబంధు పథకాన్ని లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడుని.. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్...ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వలంట అని ఎద్దేవా చేశారు.

BRS KTR fires on CM Revanth Reddy Over Rythu Bharosa 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు...విచిత్రం ఏంది అంటే మళ్లీ రైతులు ఊర్లల్లో ప్రమాణ పత్రం ఇవ్వాలని.. లేకుంటే డబ్బులు రావని కొత్త డ్రామా చేస్తున్నారు - కేటీఆర్రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎకరానికి రూ.17,500 చొప్పున రైతుబంధు బాకీ పడిందన్నారు.ఒక్కో రైతుకు, ఎన్ని ఎకరాలకు ఎంత బాకీ ఉందో ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement