BRS MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి త‌ర‌లించిన అధికారులు, క‌విత ఇంటిముందు హైటెన్ష‌న్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను అరెస్ట్ (BRS MLC Kavitha Arrest) చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి త‌ర‌లిస్తున్నారు. మ‌ధ్యాహ్నం క‌విత నివాసానికి వ‌చ్చిన ఈడీ అధికారుల (ED) బృందం.. ఆమెకు నోటీసులు ఇచ్చింది. అనంత‌రం ఆమె నివాసంలో సోదాలు నిర్వ‌హించారు.

File (Credits: Twitter)

Hyderabad, March 15: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను అరెస్ట్ (BRS MLC Kavitha Arrest) చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి త‌ర‌లిస్తున్నారు. మ‌ధ్యాహ్నం క‌విత నివాసానికి వ‌చ్చిన ఈడీ అధికారుల (ED) బృందం.. ఆమెకు నోటీసులు ఇచ్చింది. అనంత‌రం ఆమె నివాసంలో సోదాలు నిర్వ‌హించారు. అనంత‌రం ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లారు. సెర్చ్ వారెంట్ తో పాటు ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారన్న సమాచారంతో ఆమె ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అక్కడ హైటెన్షన్ నెలకొంది.

 

బీజేపీ, ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS MLC Kavitha Arrest) నినాదాలు చేశారు. కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఇవాళ ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నివాసంలో సోదాలు జరిగాయి. కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నించిన్నట్లు సమాచారం. గతంలోనూ కవితను ఈడీ పలుసార్లు విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఆయనను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Now
Advertisement