CM Revanth Reddy: స్కిల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి

మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖ అధికారుల‌తో శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.హైద‌రాబాద్ న‌గ‌రం మిన‌హా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

CM Revanth Reddy calls for integration of ITIs under Skill University(X)

Hyd, Sep 22: మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖ అధికారుల‌తో శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.హైద‌రాబాద్ న‌గ‌రం మిన‌హా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్త‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌తి ఐటీఐ క‌ళాశాలల‌కు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాల‌ని, శిక్ష‌ణ తీసుకుంటున్న వారికి స‌మ‌గ్ర‌మైన శిక్ష‌ణ అందేలా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించారు. ఐటీఐ క‌ళాశాల‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌, త‌నిఖీలు క్ర‌మం త‌ప్ప‌కుండా చేప‌ట్టాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్య‌మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఐటీఐ/ ఏటీసీ లేని శాస‌న‌స‌భ‌ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక‌ సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్‌ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో) 

ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్ గ్రేడ్ చేయాలన్నారు సీఎం. సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నీక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement