Transgender for Traffic Control: హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు.. ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు ఆదేశం
హైదరాబాద్ లో ట్రాఫిక్ నిత్యనరకంగా మారిపోయింది. హోంగార్డుల తరహాలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Hyderabad, Nov 15: హైదరాబాద్ లో (Hyderabad) ట్రాఫిక్ నిత్యనరకంగా మారిపోయింది. హోంగార్డుల తరహాలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను (Transgender for Traffic Control) వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు వీరి సేవలను ఈ మేరకు ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల తరహాలో వీరికి కూడా జీతభత్యాలు, ప్రత్యేక డ్రెస్ కోడ్ సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని తెలిపారు.
ప్రజాపాలనపై సమీక్ష
ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.