CM Revanth Review on Prajapalana: ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం.. అభయ హస్తం దరఖాస్తుల పరిష్కారం, వెబ్ సైట్ ప్రారంభం, నిధుల సేకరణపై రివ్యూ

ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన అభయహస్తం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు.

cm revanth reddy

Hyderabad, Jan 8: ప్రజాపాలనలో (Prajapalana) భాగంగా చేపట్టిన అభయహస్తం (Abhayahastham) ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు? వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలీకరణ, వెబ్ సైట్ ప్రారంభం, దరఖాస్తుల ప్రాసెసింగ్‌ కు  అవసరమైన నిధుల సమీకరణ వంటివాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు.

India Squad for Afghanistan T20Is Announced: భారీ గ్యాప్ తర్వాత టీ -20 టీమ్‌ లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అప్ఘనిస్తాన్ తో సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన

వేటికి ఎన్ని దరఖాస్తులు?

గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకూ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. మొత్తం 8 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 1.11  కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.

Fake News: లక్ష్యద్వీప్ వర్సెస్ మాల్దీవులు అంటూ ట్విట్టర్ లో వార్, మాల్దీవ్స్ ముగ్గురు మంత్రులపై వేటు అంటూ వార్తలు, అదంతా పుకార్లేనని కొట్టిపారేసిన డిప్యూటీ మినిస్టర్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement