CM Revanth Reddy: గెలిచిన వారు రాసుకున్నదే చరిత్ర కాదు...వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు కవులు ముందుకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి, బుక్ ఫెయిర్ ఘనంగా ప్రారంభం

ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Telangana CM Revanth Reddy says Books Fueled Telangana Movement(CMO X)

Hyd, December 20:  ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37 వ పుస్తక ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం...చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఆవిష్కృతమవుతోందని, పోరాటాల్లో అసులు బాసిన వాళ్లు, అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం గురికావడం, కొంత సమాచార లోపం ఉంటుంది.

సాయుధ రైతాంగ పోరాటం, తొలి దశ తెలంగాణ ఉద్యమైనా, మలి దశ తెలంగాణ ఉద్యమమైనా.. ఉద్యమాల్లో సమిధలైన, అమరులైన వారికంటే, రాజకీయంగా ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది..గత పదేళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కలాలను పదును పెట్టాలన్నారు.  ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 

సమాజం అధునాతన యుగం వైపు, సాంకేతిక పరిజ్ఞానం వైపు వెళుతున్న సందర్భంలో డిజిటల్, సోషల్ మీడియాల వంటి మాధ్యమాల వల్ల ఏది వాస్తవమో, ఏది ఆవాస్తవమో గ్రహించే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. యువతను పుస్తక పఠనంవైపు మళ్లిస్తే వాస్తవాలు తెలుసుకునే వీలుంటుందన్నారు.

1985 లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో చిన్నగా ప్రారంభించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేపట్టడం, అందులోనూ ఎంతోమంది మేధావులు పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. బుక్ ఫెయిర్ నిర్వహకులు ప్రస్తావించిన విషయాలపై ప్రొ. కోదండరాం నివేదిక రూపంలో అందజేస్తే వాటిని పరిశీలించి సామాజిక బాధ్యతగా నిర్ణయం తీసుకుంటాం అని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement