CM Revanth Reddy: తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే

తెలంగాణ వైద్యారోగ్య చ‌రిత్ర‌లో మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించింది ఉస్మానియా ఆసుప‌త్రి.

CM Revanth Reddy to lay foundation stone for new Osmania General Hospital today(CMO X)

Hyd, January 31:  తెలంగాణ వైద్యారోగ్య చ‌రిత్ర‌లో మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన ఉస్మానియా ఆసుప‌త్రి(Osmania General Hospital)కి నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని ప్రజా ప్రభుత్వం సంకల్పించగా ఇవాళ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భూమి(CM Revanth Reddy) పూజ చేయనున్నారు.

ప్ర‌స్తుతం ఉస్మానియా ఆసుప‌త్రి అఫ్జ‌ల్‌గంజ్‌లో ఉండ‌గా.. కొత్త ఆసుపత్రిని గోషామ‌హ‌ల్ స్టేడియం(Goshamahal stadium)లో నిర్మించ‌నున్నారు. 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో మొత్తం 32 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నూత‌న ఆసుప‌త్రిని నిర్మించ‌నున్నారు. 26 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ‌నున్న ఉస్మానియా ఆసుప‌త్రి కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుప‌త్రుల‌ను త‌ల‌ద‌న్నేలా ఉండాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

రాబోయే వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఉస్మానియా ఆసుప‌త్రిని నిర్మించాల‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. అందుకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్‌ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.  యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు 

అండ‌ర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్ల‌లో పార్కింగ్‌, ఆసుప‌త్రి స‌మీపంలో ఫైర్ స్టేష‌న్‌, ఆసుప‌త్రి చుట్టూ విశాల‌మైన ర‌హ‌దారులు, ఆసుప‌త్రి ప్రాంగంణంలో ఎక్క‌డికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుప‌త్రిలోకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుప‌త్రిలోని రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే వారు సేద తీరేందుకు డార్మెట‌రీలు, క్యాంటీన్‌, మ‌రుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించ‌నున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement