Controversy on Double Ismart: వివాదంలో దర్శకుడు పూరి జగన్నాథ్, డబుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ డైలాగ్, పోలీసులకు బోడుప్పల్ బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తుండగా రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.

ram pothineni(Twitter)

Hyd, July 19:  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తుండగా రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇక ఇటీవల సెకెండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత రిలీజ్ చేయగా యూ ట్రెండింగ్‌లో నిలిచింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా తెలంగాణ యాసలో వచ్చిన ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్ పెట్టడం వివాదానికి కేరాఫ్‌గా నిలిచింది. పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్‌ని ఉపయోగించగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. తాజాగా పూరి జగన్నాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ బీఆర్ఎస్ యువజన నాయకులు. మాజీ సీఎం కేసీఆర్ మాటలను డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఒక సాంగ్‌లో పెట్టడాన్ని ఖండించారు. పూరి పై చర్యలు తీసుకోవాలని కోరారు.పోలీస్ డీపీతో కాల్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ డీజీపీ ట్వీట్.. అసలేంటీ సంగతి??

కేసీఆర్ మాట్లాడిన పాపులర్ డైలాగ్స్‌లలో ఒకటైన ఏం జేద్దామంటవ్ మరీ పదాన్ని వాడారు. అది కూడా కేసీఆర్ వాయిస్‌తోనే కేసీఆర్ అంటే తాగుడూ..అనే అర్థం వచ్చేలా ఉండటమే వివాదానికి కారణమైంది. మరి దీనిపై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Here' Tweet:

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement