Hyderabad, July 19: కుటుంబ బంధాలను, మనుషుల ఎమోషన్స్ (Human Emotions) ను సైబర్ కేటుగాళ్లు (Cyber Crimes) తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ‘మీ కుటుంబ సభ్యుడు ఓ నేరంలో ఇరుక్కున్నాడ’ని హడలగొడుతూ డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తారు. తాజాగా ఇలాంటి నయా మోసాలకు కూడా నేరగాళ్లు తెరలేపారు. ఈ కొత్తరకం మోసం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ డీజీపీ ఓ వీడియో ట్వీట్ చేశారు.
#CyberFraudAlert #FakePoliceCall
ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి… pic.twitter.com/9tO9T7TJZ2
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 19, 2024
వీడియోలో ఏమున్నదంటే??
డీజీపీ ట్వీట్ చేసిన వీడియోలో ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ముంబై పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీ అబ్బాయి రేప్ కేసులో పట్టుబడ్డాడని ఊదరగొట్టాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మీ అబ్బాయి జీవితం నాశనమవుతుందని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తాడు. అయితే, ఫోన్ ఎత్తిన వ్యక్తి వివరాల కోసం ఆరా తీయడంతో అటు నుంచి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని బాధితుడు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోను తెలంగాణ డీజీపీ షేర్ చేస్తూ.. ఇలాంటి సందర్భాలలో తెలివిగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు.
వీడియో ఇదిగో, అమ్మవారికి నమస్కరించి వెండి కిరీటం సంచిలో పెట్టుకుపోయిన దొంగ
డీజీపీ ట్వీట్ లో ఏం సూచించారంటే?
‘ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని తెలంగాణ డీజీపీ వీడియో ట్వీట్ చేశారు.