Prabhas Kalki 2898 AD

Hyderabad, July 18:  ప్రభాస్ కల్కి (Prabhas Kalki) సినిమా జూన్ 27న థియేటర్స్ లో రిలీజయి భారీ హిట్ అయింది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇంత భారీ విజయం సాధించడంతో ప్రభాస్ (Prabhas) అభిమానులతో పాటు కల్కి మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కల్కి సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా ఏరియాలలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో ప్రభాస్ కూడా బోల్డన్ని రికార్డులు సృష్టించాడు. అయితే కల్కి సినిమా మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మూవీ టికెట్స్ బుక్ చేసుకునే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ బుక్ మై షోలో రిలీజ్ కి ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజు నుంచి నిన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ మూడు వారాలు అవుతున్నా కూడా రోజూ అత్యధిక టికెట్స్ సేల్ అవుతున్నాయి.

 

ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కి ముందు, రిలీజయిన మూడు వారాలకు కూడా టికెట్లు అమ్ముడుపోలేదు. తాజాగా బుక్ మై షో కల్కి సినిమాకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ (Book My Show Ticket Sales) చేసిన దగ్గర్నుంచి నిన్నటి వరకు కల్కి సినిమాకు తమ ప్లాట్ ఫారంలో అమ్ముడు పోయిన టికెట్ రేట్ల వివరాలను ప్రకటించింది. కల్కి టికెట్ బుకింగ్స్ జూన్ 23న ఓపెన్ చేయగా ఆ రోజు 328K అంటే ఆల్మోస్ట్ 3 లక్షల 28 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇక కల్కి సినిమా రిలీజ్ రోజు జూన్ 27న ఏకంగా 11 లక్షల 20 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. రిలీజ్ తర్వాత రోజు ఏకంగా 11 లక్షల 72 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి ఆన్లైన్ లో. సినిమా రిలీజయి మూడు వారాల తర్వాత కూడా నిన్న జులై 17న 1 లక్ష 28వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.

Kalki 2898 AD: నా సినీ జీవితంలో రూ. 1000 కోట్లు సినిమా ఇదే, కల్కి సినిమా ఘన విజయంపై అమితాబ్ బచ్చన్ వీడియో ఇదిగో, వేయి కోట్లు ప్ర‌భాస్‌కు నార్మ‌ల్ కావ‌చ్చు అంటూ.. 

ఇవన్నీ దేశవ్యాప్తంగా చూపించిన లెక్కలు. దేశవ్యాప్తంగా కేవలం బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ నుంచే మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో కల్కి సినిమా ఏ సినిమా సృష్టించని మరో రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఒక సినిమాకు అత్యధికంగా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ సేల్ (Book My Show Ticket Sales) అవ్వడం ఇదే మొదటిసారి అని మూవీ యూనిట్ ప్రకటించింది. ఒక్క బుక్ మై షోలోనే ఇన్ని టికెట్స్ అంటే వివిధ టికెట్ యాప్స్, డైరెక్ట్ గా థియేటర్స్ వద్ద కలిపి ఇంకెన్ని టికెట్స్ అమ్ముడయ్యాయి అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.