TRS MLA Koneru Konappa: క్వారంటైన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అమెరికాలో పర్యటించి ఇండియాకు తిరిగి వచ్చిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే, 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని అధికారుల ఆదేశాలు
కరోనావైరస్ (Coronavirus) ఆందోళనకరంగా మారిన వేళ ఇటీవల అమెరికాలో (America)పర్యటించి వచ్చిన సిర్పూర్ కాగజ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (TRS MLA Koneru Konappa) దంపతులను క్వారంటైన్‌లో ఉంచాలని ఉన్నతాధికారులు జిల్లా వైద్యా దికారిని ఆదేశించారు. అమెరికాలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో (Quarantine) ఉంచుతున్నారు. కాగా ఆయన అమెరికాలో పర్యటించిన తరువాత బయట తిరగడంపై కొమ్రం భీం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించడంపై ఆయనకు నోటీసులు జారీ చేశారు.
Hyderabad, March 21: కరోనావైరస్ (Coronavirus) ఆందోళనకరంగా మారిన వేళ ఇటీవల అమెరికాలో (America)పర్యటించి వచ్చిన సిర్పూర్ కాగజ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (TRS MLA Koneru Konappa) దంపతులను క్వారంటైన్‌లో ఉంచాలని ఉన్నతాధికారులు జిల్లా వైద్యా దికారిని ఆదేశించారు. అమెరికాలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో (Quarantine) ఉంచుతున్నారు.
ఇండియాలో 271కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
కాగా ఆయన అమెరికాలో పర్యటించిన తరువాత బయట తిరగడంపై కొమ్రం భీం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించడంపై ఆయనకు నోటీసులు జారీ చేశారు.
కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం
విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌కు వెళ్లకుండా బయట తిరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో, వైద్యశాఖ అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. కోనేరు కోనప్ప క్వారంటైన్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా శుక్రవారం ఆసిఫాబాద్ డీఎంహెచ్‌వో ఎమ్మెల్యే కోనప్పకు ప్రభుత్వం తరపున లేఖ కూడా పంపారు.
Koneru Konappa Travels From Train Amid Coronavirus Outbreak:
14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనద్దని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. లేఖ ప్రతుల్ని జిల్లా ఎస్పీకి కూడా పంపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం ఇద్దరిని కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతోపాటు లండన్‌లో చదువుకుంటున్న 18 ఏళ్ల యువతికి కూడా శుక్రవారం కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరినట్లయింది