Dubbaka ByPoll Ends: దుబ్బాక ఓటరు తీర్పు ఈవీఎంలలో.., దుబ్బాక ఉప ఎన్నికలో ముగిసిన పోలింగ్, పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదు, గెలుపు అంచనాల్లో మునిగిపోయిన వివిధ పార్టీల నేతలు

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా (Dubbaka ByPoll Ends) ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు చూసుకుంటే 81.44 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే చివరిగంటలో కోవిడ్‌ బాధితులకు (Covid Patients) అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా పోలింగ్‌ ‌ సమయం ముగిసినా క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.

Andhra Pradesh local Body Elections 2020 | (Photo-PTI)

Dubbaka, Nov 3: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా (Dubbaka ByPoll Ends) ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు చూసుకుంటే 81.44 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే చివరిగంటలో కోవిడ్‌ బాధితులకు (Covid Patients) అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా పోలింగ్‌ ‌ సమయం ముగిసినా క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.

దీంతో పోలింగ్‌ శాతం (Dubbaka Poll Percentage) మరోసారి 83కు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు కావడంతో ఆయా పార్టీల నేతలు అంచనాల్లో మునిగిపోయారు. గ్రామాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు.

దుబ్బాకలో పోలింగ్‌ సరళిని సిద్దిపేట తన నివాసం నుంచి మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్, దేవందర్ రెడ్డి వివిధ మండలాల ఇంచార్జ్‌లు ఆయనతో పాటు ఉన్నారు. కాగా, తొగుట మండలం వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది లోపాన్ని సరిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.

దుబ్బాకలో దొరికిన డబ్బులెవరివి? బీజేపీ నాయకులు అడ్డదారిలో వెళుతున్నారని తెలిపిన హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే అరాచకం నడుస్తుందని మండిపడ్డ బీజేపీ ఎంపీ బండీ సంజయ్

చేగుంటలో దొంగ ఓటు నమోదయ్యింది. అసలు ఓటరు రావడంతో అధికారులు గుర్తించారు. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లారు. పోలింగ్‌ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్‌ ఓటుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి ఇచ్చారు.

లచ్చపేటలోని దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళ్ళీకేరి పరిశీలించారు. ఈ మేరకు కోవిడ్ నిబంధనల మేరకు ప్రతీ ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజరు అందిస్తూ.. చేతికి గ్లౌజు ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారుల పనితీరును కలెక్టర్ అభినందించారు.

తాను పార్టీ మారుతున్నట్లుగా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా అసత్య ప్రచారాలు చేస్తున్న టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తోగుట మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటు హక్కు వినియోగించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత.. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాస్క్,గ్లౌస్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేస్తున్నారు. దుబ్బాక మండలం పోతారంలో కుటుంబసభ్యులతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు.

148 గ్రామాల్లో 315 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 89 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఇక్కడ పోటీ ఉంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్‌ శాతం గతంలో కన్నా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు. కాగా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నికల అనివార్యమైంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement