Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్
తెలంగాణ సెక్రటేరియట్9Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్.
Hyd, January 30: తెలంగాణ సెక్రటేరియట్9Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్. పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా పట్టుకున్నారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు.
రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు(Fake Employee)తో చలామణి అవుతున్నారు ఖమ్మం కు చెందిన భాస్కర్ రావు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ డ్రైవర్ రవి..భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
డ్రైవర్ రవినీ అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడి కార్డు తో చలామణి అవుతున్న భాస్కర్ రావు,డ్రైవర్ రవి ని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సైఫాబాద్ పోలీసులు.
Fake Employee Chaos in Telangana Secretariat
ఇప్పటివరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు..ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా.. సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది..? వీరికి ఎవరు సహకరించారు? వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.
సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని,ఫైల్ క్లియర్ చేయిస్తామని,ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు ఆరోపణలు రాగా ఏ1 భాస్కర్ రావు..ఏ2 గా డ్రైవర్ రవిని చేర్చారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్ కు పట్టుబడ్డారు భాస్కర్ రావు.