Hyderabad Shcoker: ముగ్గురు కన్నకూతుళ్లపై తండ్రి అత్యాచారయత్నం, హైదరాబాద్ లో కలకలం, భార్యను ఇంటి నుంచి తన్ని తరిమేసి, కూతుళ్లతో కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నం...

దీంతో ఇది గమనించిన మిగతా ఇద్దరు గట్టిగా అరవడంతో నుండి జారుకున్నాడు. ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా బయట గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు

Rape | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad , March 21: కన్న కూతుళ్లపైనే ఓ తండ్రి లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది. ముగ్గురు కూతుళ్లు కన్న తండ్రి వారిపైనే లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి జీవనోపాధి కోసం నగరానికి చేరుకున్న నిందితుడికి ఐదుగురు సంతానంలో ముగ్గురు 20, 13, 12 సంవత్సరాల వయస్సుగల ఆడపిల్లలు ఉన్నారు. కాగా రోజు ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మద్యానికి బానిసయ్యాడు.

భార్యతో ఘర్షణకు దిగడం మాత్రమే కాదు కన్న కూతుళ్ల పైనే లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. వారిపై కొన్ని సంధర్భాల్లో లైంగిక దాడి కూడా చేసే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన భార్య ఎప్పటికప్పుడు భర్తను అడ్డుకుని వారించేది. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని నిర్ణయించుకున్న భర్త వారం రోజుల క్రితం మార్చి 17న భార్యను బాగా చితకబాదాడు. ఆమెను ఇంటి నుండి వెళ్లగొట్టాడు.

Ex-Student Stabs Teacher: 30 ఏళ్ల క్రితం అవమానించినందుకు టీచర్‌ ను చంపేసిన స్టూడెంట్, 101 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హతమార్చిన విద్యార్ధి, 16 నెలల పాటూ గాలించి పట్టుకున్న బెల్జియం పోలీసులు

అదే రోజు రాత్రి మద్యం మత్తులో వచ్చి తన రెండవ కూతురుపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఇది గమనించిన మిగతా ఇద్దరు గట్టిగా అరవడంతో నుండి జారుకున్నాడు. ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా బయట గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఇంటినుండి తప్పించుకున్న అమ్మాయిలు ఇక తమకు చావే శరణ్యమని భావించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దగ్గరలోని చెరువు దగ్గరికి చేరుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు.

ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన..బాధితులు అయితే అదృష్టవశాత్తు వారిని చూసిన ఓ మహిళ వెంటనే వారిని చేరదీసి తనకు తెలిసిన స్వచ్చంధ సంస్థ ఫోన్ నంబర్‌ను ఇచ్చి ఫోన్ చేయించింది. స్వచ్ఛంధ సంస్థ సభ్యులు వెంటనే స్పందించి విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు. వెంటనే అమ్మాయిల వద్దకు చేరుకున్న పోలీసులు వారి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేశారు. వారి ఫిర్యాదుతో తండ్రిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వనస్థలి పురం పోలీసులు తెలిపారు.