Fire Accident In Kamareddy: కామారెడ్డిలో భారీ అగ్నిప్ర‌మాదం, పూర్తిగా కాలి బూడిదైన షాపింగ్ మాల్, ఏకంగా రూ. 5 కోట్ల‌కు పైగా న‌ష్టం, రెండు అంత‌స్తులు పూర్తిగా బుగ్గి

అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు

Fire Accident In Kamareddy

Kamareddy, DEC 14: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకున్నది. స్థానిక అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు మాల్‌లోని (Fire Accident in Mall) మిగతా అంతస్థులకు చేరాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

జేసీబీ సహాయంతో మాల్‌ షట్టర్లను తొలగించారు.ఉదయం 7 గంటల వరకు రెండు అంతస్తుల్లో మంటలను అదుపులోకి తీసుకురాగా.. మిగతా రెండు అంతస్తుల్లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Police Arrested The Bull: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు, చేనులో మేసింద‌ని 3 రోజులు స్టేష‌న్ లోనే నిర్భందం, మంచిర్యాల జిల్లాలో వింత ఘ‌ట‌న‌ 

అయితే, భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో రూ.కోట్ల విలువైన సామగ్రి కాలిబూడిదైందని మాల్‌ నిర్వాకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement