Nimmagadda Ramesh Kumar: ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Hyd, August 20: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్, కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని నాంపల్లి కోర్టు ఆదేశాలు

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ గవర్నర్ కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీటీడీ ఈవోగా కూడా ఆయన పని చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, హౌసింగ్‌ శాఖల ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక శాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

అనంతరం కొత్తగా ఏర్పడిన ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కూడా కొనసాగారు. ఆస్కీ కోర్ట్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా కొనసాగిన రమేశ్‌కుమార్‌ తాజాగా అదే సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఐఏఎస్‌ అధికారిగా రిటైర్‌ అయ్యాక ఆయన ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ’ సంస్థను ఏర్పాటు చేసి, ఓటర్లలో ఎన్నికల పట్ల అవగాహన కల్పించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement