Hyd, August 19: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు 15 రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది. స్పా ముసుగులో వ్యభిచారం, వ్యభిచార ముఠా గుట్టురట్టు,నలుగురు యువతుల అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 23న భుజంగరావు అరెస్ట్ అయ్యారు. బెయిలు కోసం ఇప్పటికే ఆయన పలుమార్లు పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తొలుత మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్ అయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారంతో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీచేశారు.