Four Youth Attempts Suicide: పోలీసులు వేధిస్తున్నారంటూ నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం.. మంచిర్యాలలో ఘటన (వీడియో)
బాధితులను శివ, అజయ్ కుమార్, రాజు, షారుక్ గా గుర్తించారు.
Mancherial, Dec 20: పోలీసులు (Police) వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల (Mancherial) జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన నలుగురు యువకులు సెల్ఫీ వీడియో తీసుకొని హెయిర్ డై తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం గురువారం కలకలం సృష్టించింది. బాధితులను శివ, అజయ్ కుమార్, రాజు, షారుక్ గా గుర్తించారు. తమను పోలీసులు వేధిస్తున్నారని, అందుకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్టు వీడియోలో తెలిపారు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.
Here's Video:
తప్పుడు ఆరోపణలే..
ఇటీవల జరిగిన ఓ దొంగతనం కేసులో సదరు నలుగురు యువకులు నిందితులుగా ఉన్నారని, గతంలోనూ వారిపై పలు కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తు చేశారు. వాటి నుంచి తప్పించుకోవడానికే వాళ్లు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు మండిపడ్డారు. యువకులను పోలీసులు వేధిస్తున్నారన్న వాదన పూర్తి వాస్తవదూరమని చెప్పారు.
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Men's Helpline Numbers:
Milaap: 9990588768; All India Men Helpline: 9911666498; Men Welfare Trust: 8882498498.
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.