Traffic Diversion in Gachibowli: గచ్చిబౌలి-కొండాపూర్‌ మార్గంలో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు, కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో మూడు నెలల పాటూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ జంక్షన్ (ORR) నుండి కొండాపూర్ (Kondapur) వైపు నూతన ప్లై ఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని మూడు నెలలు పాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic police) తెలిపారు

File Image (Credits: Hyderabad Traffic FB Page)

Hyderabad, May 11: హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో మూడు నెలల పాటూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ జంక్షన్ (ORR) నుండి కొండాపూర్ (Kondapur) వైపు నూతన ప్లై ఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని మూడు నెలలు పాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic police) తెలిపారు. ఈనెల 13 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ రహదారిలో ఎలాంటి వాహనాలు అమతించడం జరగదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతాలకు వెళ్లేవారు ఇతర రూట్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..

– ఔటర్ రింగ్ నుంచి కొత్తగూడ వైపు వెళ్లే ట్రాఫిక్ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా మీనాక్షి డెలాయిట్ మీదుగా రాడిసన్ హోటల్, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లవచ్చు.

– లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే వాహనాలు గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్, డీఎల్ఎఫ్, రాడిసన్ హోటల్ నుంచి వెళ్లొచ్చు.

– విప్రో జంక్షన్ నుంచి అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్ గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్ తీసుకొని డీఎల్ఎఫ్ మీదుగా వెళ్లాలి.

– టోలిచౌకీ నుంచి ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్డుకు వెళ్లే ట్రాఫిక్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్‌స్పేస్ అండర్ పాస్, సైబర్ టవర్, శిల్పారామం మీదుగా వెళ్లాలి.

Cyclone Mocha: తెలుగు రాష్ట్రాలు సేఫ్‌, తుఫాన్ ప్రభావం లేదని వాతావరణశాఖ ప్రకటన, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం, ఒడిషా, బెంగాల్‌పై మాత్రం మోచా ఎఫెక్ట్  

– టెలికాంనగర్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు గచ్చిబౌలి ప్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని శిల్పా లే అవుట్ ప్లై ఓవర్ ర్యాంప్ పై నుంచి డెలాయిట్ రోడ్డులో వెళ్లాలి.

– అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాల్సిన వాహనాలను బొటానికల్ గార్డెన్ వద్ద మసీద్ బండ వైపు మళ్లిస్తారు. అవసరమైన చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement