Garbage Bins In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి చెత్త డబ్బాలు, ఏకంగా 931 బిన్లు ఏర్పాటు చేయనున్న జీహెచ్‌ఎంసీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్‌ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ (GHMC) చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త (Garbage) పేరుకుపోతున్నది.

Garbage Bins In Hyderabad

Hyderabad, JAN 31: గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్‌ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ (GHMC) చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త (Garbage) పేరుకుపోతున్నది. ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజి వనరేబుల్‌ పాయింట్లు/జీవీపీ)లో చెత్త లేకుండా చేసేందుకు మళ్లీ తెరపైకి బిన్లు (Garbage Bins)ను జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Dog Attack in Hyderabad: వీడియో ఇదిగో, 6 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి, చిన్నారి కాలు పట్టుకుని రోడ్డు మీద లాగి మరీ అటాక్.. తీవ్ర గాయాలు 

ఆరు జోన్ల పరిధిలో 477 జీవీపీ పాయింట్లను గుర్తించి 931 బిన్లు ఏర్పాటు చేస్తూ కమిషనర్‌ ఇలంబర్తి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కటి 1100 లీటర్ల సామర్థ్యం ఉన్న బిన్లను జీవీపీ సెంటర్ల వద్ద ఏర్పాటు చేయనున్నారు. అడ్వాన్స్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ విధానంలో ఈ డస్ట్‌బిన్‌ల పర్యవేక్షణ జరగనుంది. బిన్లలో 70 శాతం చెత్త పడగానే ఆర్‌ఎఫ్‌ఐడీ సెన్సార్‌ ద్వారా ఆ రూట్‌లో ఉన్న స్వచ్ఛ వాహనం (చెత్త లిఫ్టింగ్‌ చేసే వాహనం) అలర్ట్‌ చేస్తుంది. దీంతో అటుగా వెళ్లే వాహనంలో ఈ బిన్లలో చెత్తను క్లియర్‌ చేయనున్నారు. తద్వారా గతంలో మాదిరిగా జీవీపీ పాయింట్ల వద్ద కుక్కలు, పశువులు చిందర వందర చేసే అవకాశాలు ఉండవని అధికారులు చెబుతున్నారు.

జోన్లవారీగా చెత్త బిన్‌లు ఏర్పాటు చేసే వివరాలు

ఎల్బీ నగర్‌ జోన్‌లో 46 జీవీపీ పాయింట్ల వద్ద 106 బిన్‌ల ఏర్పాటు

చార్మినార్‌ జోన్‌లో 136 జీవీపీ పాయింట్ల వద్ద 267 బిన్‌ల ఏర్పాటు

ఖైరతాబాద్‌ జోన్‌లో 76 జీవీపీ పాయింట్ల వద్ద 166 బిన్‌ల ఏర్పాటు

సికింద్రాబాద్‌ జోన్‌లో 91 జీవీపీ పాయింట్ల వద్ద 152 బిన్‌ల ఏర్పాటు

శేరిలింగంపల్లి జోన్‌లో 71 జీవీపీ పాయింట్ల వద్ద 130 బిన్‌ల ఏర్పాటు

కూకట్‌పల్లి జోన్‌లో 57 జీవీపీ పాయింట్ల వద్ద 110 బిన్‌ల ఏర్పాటు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement