Khammam Shocker: పీకల దాకా ప్రేమలో మునిగారు, పెళ్లి మాట ఎత్తగానే నో చెప్పిన ప్రియుడు, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ప్రియురాలు, చికిత్స పొందుతూ యువతి మృతి, సత్తుపల్లిలో విషాద ఘటన

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకున్న తరువాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో (BoyFriend reject marriage proposal) ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

Representational Image (Photo Credits: File Image)

Khammam, May 5: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకున్న తరువాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో (BoyFriend reject marriage proposal) ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తుపల్లి పట్టణంలోని (Sathupalli in Khammam) ద్వారకాపురి కాలనీకి చెందిన అలవాల డేవిడ్‌రాజు, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూష(18) సిరిసిల్లలో డిప్లొమా చదువుతోంది. కరోనావైరస్ కారణంగా క్లాసులు లేకపోవటంతో గతేడాది నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోందని బంధువులు తెలిపారు.

సొంతూరు సత్తుపల్లి వచ్చినప్పుడల్లా ప్రత్యూష..తన అమ్మమ్మ సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఉండటంతో అక్కడకు వస్తూ పోతూ ఉండేది. ఆ సమయంలోనే అదే ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న బండి భాస్కర్‌రావు, వెంకటమ్మల కుమారుడు జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటూ కాలం గడిపేశారు. ఎనిమిది నెలల తర్వాత పెళ్లి చేసుకుందామని యువతి అడగడంతో ప్రియుడు జగదీష్‌ పెళ్లికి నో చెప్పాడు.

రెండో భార్యతో హనీమూన్, డబ్బుల కోసం మొదటి భార్య కొడుకుని రూ.18 లక్షలకు అమ్మిన కసాయి తండ్రి, వచ్చిన డబ్బుతో రెండో భార్యతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్‌, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్న చైనా వ్యక్తి

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష ఏప్రిల్‌లో 30న హైదరాబాద్‌లో శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు (Girlfriend commits suicide) పాల్పడింది. ఆమె స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందింది. దీంతో ప్రియుడు జగదీష్‌ కారణంగానే ప్రత్యూష మృతి చెందిందని బషిర్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

నా కూతుర్నే ప్రేమిస్తావా..యువకుడి కాళ్లు చేతులు నరికేసిన ప్రియురాలి బంధువులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన ప్రియుడు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో దారుణ ఘటన

తుంబూరులో నివాసం ఉంటున్న ప్రియుడు జగదీష్‌ ఇంటి ఎదుట మంగళవారం ప్రత్యూష మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో విషయం తెలిసిన జగదీష్, తల్లిదండ్రులు పరారయ్యారు. సత్తుపల్లి ఎస్సై జి.నరేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి, ధర్నాను విరమింపజేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement