Man Sells 2 Year Old Son: రెండో భార్యతో హనీమూన్, డబ్బుల కోసం మొదటి భార్య కొడుకుని రూ.18 లక్షలకు అమ్మిన కసాయి తండ్రి, వచ్చిన డబ్బుతో రెండో భార్యతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్‌, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్న చైనా వ్యక్తి
Baby (Photo Credits; Pixabay) (Representational image Only)

Zhejiang, May 4: చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి రెండో భార్యతో హనీమూన్ టూర్ కోసం మొదటి భార్య కొడుకుని 18 లక్షలకు (Man Sells 2 Year Old Son) అమ్మేశాడు. ఆ డబ్బులతో రెండో భార్యతో హనీమూన్‌కు (Holiday With His New Wife) వెళ్లి ఎంజాయ్‌ చేసి వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం ఆ తండ్రి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. చైనా జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు (పాప, బాబు) పుట్టారు. అయితే దంపతుల మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో కోర్టు తల్లికి కూతురు బాధ్యతను.. తండ్రికి కొడుకు బాధ్యతలను అప్పగించింది.

ఇక ఉద్యోగం చేస్తున్న ఆ తండ్రికి చిన్నారి బాధ్యతలు చూడటం చాలా ఇబ్బందిగా మారింది. దాంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బిడ్డను తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తిని కోరాగా..అందుకు రెండో భార్య అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బిడ్డ ఎప్పటికైనా తనకు అడ్డంకే అని భావించిన ఆ తండ్రి బిడ్డను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు.

కరోనాతో మరణిస్తే కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, వైరల్ అవుతున్న మెసేజ్‌ అంతా అబద్దం, ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిర్ధారణ, ఈ ఫేక్ మెసేజ్ గురించి ఓ సారి తెలుసుకోండి

అనుకున్నదే ఆలస్యం.. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. రెండేళ్ల తన కొడుకును తీసుకువచ్చాడు. బాబు కన్నతల్లి (మొదటి భార్య) బాబుని చూడాలని కోరిందని.. అందుకే తీసుకెళ్తున్నానంటూ కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ ప్రబుద్ధుడు రెండు సంవత్సరాల చిన్నారిని 1,58,000 యువాన్లు(సుమారు 18 లక్షల రూపాయలు)కు (Man Sells 2-Year-Old Son For Rs 18 Lakh) అమ్మేశాడు. ఆ వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. జాలీగా ఎంజాయ్‌ చేయసాగాడు. ఇక బాబును తల్లి దగ్గరికి తీసుకెళ్లి వారం రోజుల పైనే అవుతుంది.

ఈ గొర్రెల కాపరి ఇప్పుడు సోషల్ మీడియా స్టార్, గిజిగాడి గూడును మాస్క్‌లా ధరించిన మేకల కుర్మయ్య, పెన్సన్ కోసం పిచ్చుక గూడును ఫేస్ మాస్క్‌లా వాడానని వెల్లడి, కొవిడ్ నిబంధనల పట్ల బాధ్యతగా వ్యవహరించారంటూ అభినందనలు

ఇంకా తిరిగి తీసుకురాకపోవడంతో.. బాబు తండ్రికి అతడి కుటుంబ సభ్యులు కాల్‌ చేశారు. కానీ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దాంతో కన్నతల్లికి కాల్‌ చేసి బిడ్డ గురించి అడగ్గా ఆమె తన దగ్గరకు తీసుకురాలేదని తెలిపింది. దాంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేయగా.. సదరు వ్యక్తి బాబును అమ్మకానికి పెట్టి.. వచ్చిన డబ్బుతో కొత్త భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లినట్లు తెలిసింది.

కరోనా మళ్లీ కొత్త అవతారం, దేశంలో ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ట్రిపుల్ మ్యూటెంట్‌ గుర్తింపు, ఇప్పటికే వణికిస్తున్న డబుల్ మ్యూటెంట్‌

దంపతులు వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. చైనాలో ఇలాంటి సంఘటలను తరచుగా చోటు చేసుకుంటాయి. గతేడాది ఓ వలస కూలీ అప్పుడే పుట్టిన బిడ్డను 17.74 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. మరో 19 ఏళ్ల కుర్రాడు ఐఫోన్‌ కోసం నవజాత శిశువును అమ్ముకున్నాడు.