Govt Teacher Commits Suicide: తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో పురుగుల మందు తాగిన అనిల్‌కుమార్‌, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిద్దిపేట ఎస్సై

తెలంగాణలో సిద్దిపేట రూరల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య (Govt Teacher Commits Suicide) చేసుకున్నాడు.

representational image (photo-Getty)

Hyderabad, Jan 26: తెలంగాణలో సిద్దిపేట రూరల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య (Govt Teacher Commits Suicide) చేసుకున్నాడు. సిద్దిపేట ఎస్‌ఐ శంకర్‌ (siddipet SI Sanker) తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలానికి చెందిన పుర్మ అనిల్‌కుమార్‌, జ్యోతి దంపతులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అనిల్‌కుమార్‌ మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా, భార్య జ్యోతి కొండపాక మండలం సిర్సినగండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈ దంపతులు సిద్దిపేటలోని శ్రీనివాస నగర్‌లో నివాసముంటున్నారు.

వారు పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌ పరిధిలోని నాయకంనగర్‌లో నూతనంగా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రూ. కోటి అంచనా వ్యయంతో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. బేస్‌మెంట్‌ నిర్మాణం లెవలింగ్‌ కోసం దాదాపు రూ. 15 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేందుకు ఇంకా నగదు అవసరమైన కావడం.. ఆ నగదు కోసం ఎంత ప్రయత్నించినా సర్దుబాటు కాకపోవడంతో అనిల్ కుమార్ మనస్తాపానికి గురయ్యాడు.

నేనే శివుడిని..అందుకే కరోనాని పంపించాను, పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మదనపల్లె కూతుర్ల హత్య కేసు నిందితులు, రేపటిలోగా వాళ్లిద్దరూ బతికి వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అనిల్‌కుమార్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య జ్యోతి ఫోన్‌ చేసింది అయినా స్పందించకపోవడంతో ఆమె సిద్దిపేట టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా సోమవారం ఉదయం పోలీసులు, మృతుడి తండ్రి ఇంద్రారెడ్డి బూర్గుపల్లి, ఇర్కోడు శివారులో వెతుకుతుండగా మోదుగు చెట్ల పొదల మధ్య పురుగుల మందు తాగి చనిపోయినట్లు (Teacher Commits Suicide) గుర్తించారు.

చేపల కూర గొడవ..మంచం కోడితో వ్యక్తిని చంపిన మరో వ్యక్తి, శ్రీకాకాళం జిల్లా అనుమానాస్పద హత్యను చేధించిన పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన పాతపట్నం సీఐ రవిప్రసాద్‌

సిద్దిపేట రూరల్‌ ఎస్సై శంకర్‌ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇంటి నిర్మాణం గురించి మదనపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement