Madanapalle, Jan 26: మదనపల్లెల్లో కన్న తల్లిదండ్రులే తమ ఇద్దరు కూతుర్లను ఆధ్మాత్మికత పిచ్చిలో హత్య చేయడం (Madanapalle Murder Case) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి విదితమే... ఈ కేసులో కిరాతక తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దర్నీ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జంట హత్యల కేసులో (madanapalle parents killed daughters) A 1గా పురుషోత్తం నాయుడు, A 2 గా పద్మజను చేర్చారు. మంగళవారం సాయంత్రం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా తమ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులతో పద్మజ మరోసారి గొడవకు దిగారు. దేవుడి గదిలోకి బూట్లు వేసుకుని రావొద్దని, ఫొటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు.
వారిని అదుపులోకి తీసుకువెళ్లేందుకు వారింటికి వెళ్లిన పోలీసులతో నిందితురాలు ‘‘నా బిడ్డల్ని వాళ్లకు ఎందుకు చూపిస్తున్నారు. నువ్వు చేసిన పని వల్లే కదా అయ్యా ఇదంతా జరిగింది’’ అని భర్త పురుషోత్తం నాయుడును నిందించారు. ఇక తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పోలీసులను వేడుకున్న పద్మజ.. ‘‘ఈ ఒక్కరోజు వినండి ప్లీజ్ సర్. రేపటి లోగా నా బిడ్డలు బతికి వస్తారు. ఈ ఒక్కరోజు వదిలేయండి. మీ కాళ్లకు మొక్కుతా సర్’’ అంటూ విలపించారు. పోలీసులు తీసుకువెళ్తున్న సమయంలోనూ చేతులతో సైగలు చేస్తూ ఆమె విచిత్రంగా ప్రవర్తించడం వారి మానసిక స్థితి ఎంతలా ఆధ్యాత్మికతలో మునిగిపోయిందో ఇట్టే తెలుస్తుంది.
బంగారం లాంటి ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన తల్లి పద్మజ మూఢనమ్మకాలతో పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కరోనా టెస్టుకు తీసుకెళ్లిన పోలీసులకు కూడా ఆమె చుక్కలు చూపించారు. కరోనావైరస్ చైనా నుంచి రాలేదని, చెత్తను కడిగేయడానికి తన శరీరం నుంచి తానే వైరస్‌ను పంపించానంటూ బిగ్గరగా కేకలు వేశారు. తానే శివుడినని, తనకు ఏ టెస్టు అవసరం లేదంటూ గందరగోళం సృష్టించారు.
Here's Update Video
Vammooo.. endo emo..#Madanapalle incident twists pic.twitter.com/MGvaSzt2j4
— I'm lost (@urstruly_AK) January 26, 2021
అంతకుముందు పద్మజ, పురుషోత్తంనాయుడు దంపతులను సుదీర్ఘ సమయం పాటు విచారించిన పోలీసులకు మతిపోయినంత పనైంది. దయ్యం పట్టినందునే తమ కుమార్తెలను డంబెల్స్ తో కొట్టిచంపామని, మళ్లీ వాళ్లిద్దరూ బతికి వస్తారని చెప్పారు. తమ ఇంట్లో కొన్నిరోజులుగా ఎన్నో మహిమలు జరిగాయని, తమ ఇంట్లో దేవుళ్లు ఉన్నారని తెలిపారు. తాము పూజలతోనే చిన్నకుమార్తె సాయిదివ్య అనారోగ్యాన్ని తగ్గించామని, వారం పాటు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి బయట పూజలు చేశామని చెప్పారు. 10 రోజులుగా ఉపవాసాలు ఉన్నామని పేర్కొన్నారు.
ఇక కలియుగం అంతమైందని, సత్యయుగం మొదలైందని పోలీసులకు వివరించారు. తమ ఇద్దరు కుమార్తెలను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నామని, వారిద్దరూ చదువుల్లో మేటి అని తల్లి పద్మజ తెలిపింది. తాము పూర్తి స్పృహలోనే ఉన్నామని, తమ పిల్లలు ప్రాణాలతో మళ్లీ తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేసింది.