Hyderabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ సిబ్బందిపై కర్రలతో దాడి.. హైదరాబాద్ హోటల్‌లో రౌడీల వీరంగం

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోటల్‌లో గది కోసం వచ్చిన కొందరు వ్యక్తులను. నియమాల ప్రకారం ఐడీ ప్రూఫ్ అడిగిన పాపానికి హోటల్ సిబ్బందిపై నడిరోడ్డుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ దారుణ సంఘటన నగరంలోని భరత్‌నగర్ పరిధిలో ఉన్న 'లివింగ్ ట్రీ సూట్స్' అనే హోటల్‌ వద్ద చోటుచేసుకుంది.

Attack on Hotel Employees in Hyderabad.(Photo- Video Grab)

Hyderabad Shocker: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోటల్‌లో గది కోసం వచ్చిన కొందరు వ్యక్తులను. నియమాల ప్రకారం ఐడీ ప్రూఫ్ అడిగిన పాపానికి హోటల్ సిబ్బందిపై నడిరోడ్డుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ దారుణ సంఘటన నగరంలోని భరత్‌నగర్ పరిధిలో ఉన్న 'లివింగ్ ట్రీ సూట్స్' అనే హోటల్‌ వద్ద చోటుచేసుకుంది.

హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవడానికి వచ్చిన కొందరు వ్యక్తులను, నిబంధనల ప్రకారం ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు) చూపించాలని అక్కడ పనిచేస్తున్న ఆకాష్ అనే హోటల్ సిబ్బంది కోరారు. దానికి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు మేము లోకల్.. మమ్మల్నే ఐడీ ప్రూఫ్ అడుగుతావా అంటూ సిబ్బందిపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.

బీపీ టెస్ట్‌ కోసం పది నిమిషాలు ఆగమన్నందుకు డాక్టర్‌పై స్టూల్‌తో దాడి.. బీపీ చెక్ చేయకుండానే తేలిపోయిందంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు.. వైరల్ వీడియో ఇదిగో..

అంతటితో ఆగకుండా, ఆకాష్‌ను బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపైనే కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆకాష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న అతడిని తోటి ఉద్యోగులు వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

CCTV Captures Violent Attack on Hotel Employees in Hyderabad

ఈ దాడి సంఘటనపై హోటల్ యాజమాన్యం, బాధితుడి తోటి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement