Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, అప్పు చెల్లించలేదని ఎంబీఐ విద్యార్థినిపై అత్యాచారం, వీడియో చూపించి మరికొందరు బ్లాక్ మెయిల్

ఎంబీఏ విద్యార్థినికి అప్పు ఇచ్చిన ఆమె క్లాస్‌మేట్‌ తిరిగి అప్పు చెల్లించలేదని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. షీ టీమ్‌ ద్వారా వివరాలు తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Credits: Google

Hyd, June 8: హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంబీఏ విద్యార్థినికి అప్పు ఇచ్చిన ఆమె క్లాస్‌మేట్‌ తిరిగి అప్పు చెల్లించలేదని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. షీ టీమ్‌ ద్వారా వివరాలు తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నారాయణగూడలోని ఓ కళాశాలలో ఎంబీఏ ఫస్టియర్‌ చదువుతున్న యువతి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కొన్ని నెలల క్రితం తన క్లాస్‌మేట్‌ నుంచి డబ్బు తీసుకుంది.అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల నగదు చెల్లించలేకపోవడంతో తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు.

ఇద్దరితో రహస్యంగా అక్రమసంబంధం, మొదటి వ్యక్తికి తెలియడంతో రెండో ప్రియుడితో కలిసి అతన్ని దారుణంగా హత్య చేసిన మహిళ, కేసు వివరాలను వెల్లడించిన మహేశ్వరం ఏసీపీ సి.అంజయ్య

గత్యంతరం లేని ఆమె అంగీకరించడంతో కొన్ని రోజుల క్రితం నారాయణగూడలోని ఓయో రూమ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా ఉండగా సదరు యువకుడు రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. దాన్ని మరుసటి రోజు తన స్నేహితులకు చూపించాడు. అప్పటి నుంచి ఇతడితో పాటు మరో నలుగురు యువకులు తమ కోరిక తీర్చాలంటూ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలెట్టారు. అలా చేయకుంటే వీడియో వైరల్‌ చేస్తామని బెదిరించారు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఆ వీడియోను వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశారు.

మానసిక క్షోభకు గురైన యువతి ఇటీవల షీ టీమ్‌ను ఆశ్రయించింది. నిందితులపై కేసు పెట్టాలని షీటీమ్‌ నారాయణగూడ పోలీసులకు సిఫార్సు చేసింది. దీంతో ఐదుగురు యువకులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వీరిని గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.