Woman Doctor Attempted Suicide: మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం కేసులో షాకింగ్ విషయాలు, ఫిర్యాదు కోసం వెళితే పోలీసులు ఉచిత సలహాలు ఇచ్చారంటూ సూసైడ్ నోట్, కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్పీ వీడియో

హైదరాబాద్ నగరంలో మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఫెర్నాండేజ్‌ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రణీతరెడ్డి అత్తమామల వేధింపులు భరించలేక సూసైడ్ (Praneetha Reddy Attempted Suicide) చేసుకునేందుకు ప్రయత్నించింది.

Hyderabad Woman Doctor Praneetha Reddy Attempted Suicide (Photo-TeluguScribe)

Hyd, Jan 29:హైదరాబాద్ నగరంలో మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఫెర్నాండేజ్‌ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రణీతరెడ్డి అత్తమామల వేధింపులు భరించలేక సూసైడ్ (Praneetha Reddy Attempted Suicide) చేసుకునేందుకు ప్రయత్నించింది. ముందుగా సెల్పీ వీడియో తీసుకుని ఆ తర్వాత దారుణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌ ప్రణీతరెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సికిందర్‌రెడ్డి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరు కొన్నాళ్లపాటు అమెరికాలో ఉండి 2021లో నగరానికి తిరిగి వచ్చి చంపాపేట్‌ ప్రెస్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల పాప (విహ) ఉంది. అయితే దంపతుల మధ్య గొడవలు జరగుతూ వస్తున్నాయి. పలుమార్లు సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌(Saroornagar Police Station) వరకు ఇవి వెళ్లాయి. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో ఉంది.

భర్త, అత్తమామల వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నం, హైదరాబాద్‌లో ఘటన, కర్మాన్‌ఘట్ ఆస్పత్రికి తరలింపు

ఈ గొడవల నేపథ్యంలో సికిందర్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ప్రణీతరెడ్డికి (Woman Doctor Praneetha Reddy)  అత్తమామల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పై పోర్షన్‌లో అత్తమామలు నివసిస్తుండగా, కింది పోర్షన్‌లో ప్రణీత, కుమార్తె, ఆమె తల్లి ఉంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మరలా గొడవ జరగగా ప్రణీత సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఇన్‌స్పెక్టర్‌ పట్టించుకోకపోగా, అక్కడ ఎందుకు ఉంటున్నావు, వేరుగా ఉండొచ్చుకదా అని ఉచిత సలహా ఇచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మంగళవారం డాక్టర్‌ ప్రణీత పుట్టినరోజు. ఆ రోజు కూడా అత్తమామల వేధింపులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో మాత్రలు వేసుకొని (Woman Doctor Attempted Suicide) సెల్ఫీ వీడియోలో.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె చంపాపేటలోని జీవన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్‌ ప్రణీత అత్తమామలకు మద్దతుగా సీఎం సెక్యూరిటీ ఆఫీసులో పనిచేస్తున్న చక్రీధర్‌రెడ్డి పోలీసులకు తరచూ ఫోన్‌ చేసేవారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత సెల్ఫీ వీడియో వైరల్‌ అయింది.

డాక్టర్‌ ప్రణీతరెడ్డి ఆత్మహత్యాయత్నానికి నిరసనగా బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రణీతరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన అత్తమామ, ఇతర కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Hyderabad Woman Doctor Praneetha Reddy Attempted Suicide

ప్రణీత సూసైడ్ నోట్‌లో ‘పోలీస్‌ డౌన్‌.. డౌన్‌.. నో జస్టిస్‌.. ప్రొటెక్ట్‌ చేయాల్సిన మీరే ఏమీ పట్టనట్లు కూర్చున్నారు. నాకు న్యాయం జరగకముందే మా అత్తమామలు నన్ను చంపేస్తారు. వాళ్ల చేతుల్లో హింసలు అనుభవిస్తూ చావడం కన్నా.. ఇలా పీస్‌ఫుల్‌ ఇన్‌స్లీప్ బెటర్‌’ అని డాక్టర్‌ ప్రణీతరెడ్డి సూసైడ్‌ నోట్‌లో రాసిన మాటలు పలువురిని కంటతడిపెట్టిస్తున్నాయి.

తన కుమార్తె విహారెడ్డిని జాగ్రత్తగా చూడాలని తల్లిదండ్రులను వేడుకుంది. నాలా అమాయకంగా పెంచొద్దని, ధైర్యంగా ఉండేలా పెంచాలని సూచించింది. ‘సారీ విహ.. టాటా.. మామ్‌ పై కోపం పెట్టుకోకు. అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య, వదిన, పిన్నీ, బాబాయ్‌. మీరంతా నన్ను ప్రేమతో చూసుకున్నారు. నేను ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల మీరందరూ బాధపడుతున్నారు. నా వల్ల మీరు ఎన్నో అవమానాలు భరించారు. ఇక మీకు నా నుండి ఎలాంటి కష్టాలు ఉండవు. ప్లీజ్‌ నన్ను క్షమించండి. విహలో నన్ను చూసుకోండి’ అని లేఖలోపేర్కొంది.

తనకు జరిగిన అన్యాయంపై ఏసీపీ, డీసీలను సంప్రదించినా వేధింపులు తగ్గలేదని అందులో వివరించింది.భర్త సికిందర్‌రెడ్డి ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో చట్టపరంగా ఎదుర్కోవడానికి తాను చేసే ప్రయత్నానికి అత్తమామలు, ఇతర బంధువుల వేధింపులపై ఫిర్యాదు చేస్తే ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి పట్టించుకోలేదని, అత్తమామలకే ఆయన మద్దతు తెలిపేవాడని సూసైడ్‌ నోట్‌లో రాసింది.

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Uttar Pradesh: వీడియో ఇదిగో, గుండెపోటుతో ఆస్పత్రికి మహిళ వస్తే వైద్యం చేయకుండా రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్, కళ్లముందే విలవిలలాడుతూ బాధితురాలు మృతి

Woman Doctor Attempted Suicide: మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం కేసులో షాకింగ్ విషయాలు, ఫిర్యాదు కోసం వెళితే పోలీసులు ఉచిత సలహాలు ఇచ్చారంటూ సూసైడ్ నోట్, కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్పీ వీడియో

Hyderabad Murder Case: భార్యను దారుణంగా చంపిన కేసులో ఆ ఒక్క క్లూతో దొరికిపోయిన మాజీ ఆర్మీ జవాను గురుమూర్తి, ఎంత భయానకంగా చంపాడో మీడియాకి తెలిపిన పోలీసులు

Share Now