Hydra Demolition Drive: హైదరాబాద్ లోని పటాన్ చెరులో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. వీడియోతో

హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు రంకెలేస్తున్నాయి.

HYDRA (Credits: X)

Hyderabad, Jan 31: హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా (Hydra Demolition Drive) ఝలిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు రంకెలేస్తున్నాయి. స్థానికంగా 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

Here's Video:

త్వరలో పీఎస్

చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. చాలా వరకు చెరువు భూములను సైతం కాపాడింది. ఇప్పటికే నిర్మించిన చాలా వరకు ఆక్రమణకు కూల్చివేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి పోలీసు స్టేషన్ ను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నది.

యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement