Hyderabad, Jan 25: మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి దివ్యా నగర్ లో హైడ్రా కూల్చివేతలు (HYDRA Demolition Drive) మొదలుపెట్టింది. ఘట్ కేసర్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం ఈ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు పిర్యాదులు కూడా అందాయి. దీంతో సర్వే చేసిన అధికారులు ఆ జాగా ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి కూల్చివేతలు మొదలుపెట్టారు. భారీగా పోలీసులను మొహరించారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
Here's Video:
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి దివ్యా నగర్ లో హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధం...
ఘట్కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం
నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు పిర్యాదులు
సర్వే… pic.twitter.com/lLsIH60oxR
— ChotaNews App (@ChotaNewsApp) January 25, 2025
హైడ్రా పీఎస్
హైడ్రా (HYDRA) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీలో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న బుద్ధ భవన్ బీ-బ్లాక్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు