Kanthi Dutt: కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లను మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ అరెస్ట్.. హిట్ అండ్ రన్, మోసం వంటి కేసులోనూ నిందితుడు

కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్‌ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Kanthi Dutt (Credits: X)

Hyderabad, Dec 2: కీర్తీ సురేశ్ (Keerthi Suresh), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్‌ ను  జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాంతి దత్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టు సమాచారం. వాటాల పేరుతో కాంతి దత్  ఈ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో సెలబ్రిటీల చేత పెట్టుబడులు పెట్టించి అతను మోసగించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాంతి దత్ దాదాపు వంద కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

రైతులకు గుడ్ న్యూస్...సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, విధి విధానాలు త్వరలో వెల్లడి

అలా కేసు వెలుగులోకి..

నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి సమంత సన్నిహితురాలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి కాంతి దత్ చేతిలో తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

నేరాల చిట్టా కూడా

కాంతిదత్ మీద మాదాపూర్ పీఎస్ లో హిట్ అండ్ రన్ కేసు ఒకటి నమోదైంది. జూలై 14న బెంజ్ కారుతో ర్యాపిడో డ్రైవర్ ను గుద్దేసి కాంతి దత్ ఉడాయించాడు. ఖతార్ కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ ను రూ. 6 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంలో నవంబర్ 15న సీసీఎఎస్ లో కూడా ఈయనపై చీటింగ్ కేసు నమోదైంది.

తెలంగాణ నీటి వాటాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ అనుమతులు తీసుకోవాలని సూచన

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Share Now
Advertisement