KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

ముఖ్యమంత్రి నిన్న అదానీ అంశానికి సంబంధించి మాట్లాడిన కారణంగా మాట్లాడాల్సి వస్తోంది... రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్...రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత నేను వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడు అన్నారు.

KTR Slams Revanth Reddy for misleading claims on Adani investments(BRS X)

Hyd, Nov 26:  ముఖ్యమంత్రి నిన్న అదానీ అంశానికి సంబంధించి మాట్లాడిన కారణంగా మాట్లాడాల్సి వస్తోంది... రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్...రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత నేను వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడు అన్నారు.

రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కావాల్సినంత దోపీడి జరుగుతుంది. ఇంకా ఎందుకు మమ్మల్ని తిడుతున్నాడో అర్థం కావటం లేదు.. నిన్న ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టినాయుడును చిప్ దొబ్బినట్లు అనిపించిందన్నారు. మేము అదానీకి ప్రాజెక్టులు ఇచ్చామంటాడు. ఎంపీగా కూడా పనిచేసిన ఈయన జాతీయ రహదారుల ప్రాజెక్టులు మేము ఇచ్చామంటాడు... ప్రజలను తక్కువ అంచనా వేస్తూ వాళ్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.

నువ్వు చెప్పే వాటిని ప్రజలు నమ్మరు. మీడియా ఎవ్వరూ కూడా నమ్మరు.. రక్షణ శాఖకు ఇచ్చిన ప్రాజెక్టులు మేము ఇచ్చామంటాడు. రక్షణ శాఖ మా చేతిలో ఉంటుందా? మరీ రాజ్ నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నట్లు? అన్నారు. విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే. ఇంత తెలివితక్కువగా మాట్లాడితే ఏం అనుకోవాలి... ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అబద్ధాలను మీడియా మిత్రులు కూడా ప్రశ్నించాలన్నారు. డ్రైపోర్ట్ కూడా కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన అంశం. కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము ఎవరికీ ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్లు చూపించారు...చిట్టి నాయుడుకు ఏమీ తెలియదు. ఎవరన్న చెప్పినా వినడు. ఆయన మూర్ఖుడు అన్నారు.

మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు.... రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం... కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడు అన్నారు. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేశాడు... నీకు సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటకలుస్తుందన్నారు. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయ్యావ్.. మైక్రోసాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చింది. ఆమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

మొత్తం రూ. 67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను మేము తీసుకొచ్చాం.. నేను అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడు. బరాబర్ దావోస్‌లో కలిశాను. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్‌లో పెట్టాను అన్నారు. నీలాగా ఇంటికి పిలిపించుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు, కోహినూర్ హోటల్‌లో కాళ్లు పట్టుకోలేదు.. నాకు నీలాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదు. ఏదీ చేసిన బజాప్తా చేస్తా అన్నారు కేటీఆర్. అదానీ మేము అసలు ఎంకరేజ్ చేయలేదు..నీ లెక్క లుచ్చా పనులు చేసే.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాది కాదు అన్నారు.

ఫ్రస్ట్రేషన్‌లో నన్ను తిడుతున్నావ్ సరే నాకు ఏమీ ఫరక్ పడదు. ప్రశ్నిస్తే నేను సైకోనా?, కొండారెడ్డి పల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరి నువ్వు శాడిస్ట్ వా? అని ప్రశ్నించారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివి... ఏం చేస్తావో చేసుకో. నీకు భయపడేవాళ్ల కాదు మేము అన్నారు. మీడియా మిత్రుడు ఒకరు నిన్న మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టాలని హైద్రాబాద్ వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిందని ప్రశ్నిస్తే... ఎవడో పుల్లయ్య, మల్లయ్య చెప్పిండు అంటాడు... ఎల్లయ్య, మల్లయ్య చెప్పలేదు. ప్రభుత్వంలోని నీ శాఖనే చెప్పిందన్న సోయి కూడా లేదు అని మండిపడ్డారు కేటీఆర్.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now