Lovers Committed Suicide: ప్రేమించుకున్నారు, పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నారు, నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం బిల్లకల్‌ అటవీ ప్రాంతంలో విషాద ఘటన

ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలనుకున్నారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, అయితే వారు ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ ప్రేమజంట కలిసి బతకకపోయినా.. కలిసి తనవు చాలించాలని నిర్ణయించుకొని ఉరేసుకొని (Lovers Commits Suicide) మృతి చెందారు. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్‌ (Nagar Kurnool) జిల్లా బల్మూర్‌ మండలం బిల్లకల్‌ అటవీ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది.

representational image (photo-Getty)

Hyderabad, Oct 20: ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలనుకున్నారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, అయితే వారు ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ ప్రేమజంట కలిసి బతకకపోయినా.. కలిసి తనవు చాలించాలని నిర్ణయించుకొని ఉరేసుకొని (Lovers Commits Suicide) మృతి చెందారు. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్‌ (Nagar Kurnool) జిల్లా బల్మూర్‌ మండలం బిల్లకల్‌ అటవీ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది.

పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిల్లకల్‌కు చెందిన రాయ అఖిల(19), చెంచుగూడెంకు చెందిన అనిల్‌(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబాల పెద్దలకు తెలియటంతో పెళ్లికి నిరాకరించి మందలించారు. దీంతో వారిద్దరూ కలిసి చావాలని నిర్ణయించుకొని సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రుసుల చెరువు అటవీశాఖ బేస్‌ క్యాంప్‌ వద్దకు బైక్‌పై వెళ్లారు. క్యాంప్‌ వెనుక భాగంలో ఉన్న చెట్టుకు చున్నీతో ఇద్దరూ ఉరేసుకుని మృతిచెందారు. అటుగా వెళ్లిన మేకల కాపరులు గుర్తించి ఇరువురి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.

వివాహేతర సంబంధం గొడవ, భార్య తలను నరికి అనుమానిత ప్రియుడి ఇంటి గుమ్మానికి వేలాడదీసిన భర్త, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు

విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనలో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement