Man Grows Ganja Plants in Pots: మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)

వరంగల్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని శివనగర్ కి చెందిన పల్లెబోయిన కుమార్ (60) అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి, తన అవసరాల కోసం అడ్డదారులు తొక్కాడు.

Man Grows Ganja Plants in Pots (Credits: X)

Warangal, Nov 8: వరంగల్ (Warangal) జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని శివనగర్ కి చెందిన పల్లెబోయిన కుమార్ (60)  అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి, తన అవసరాల కోసం అడ్డదారులు తొక్కాడు. ఇంటి మేడపైన పూల కుండీలలో గంజాయి మొక్కలు (Man Grows Ganja Plants in Pots) పెంచాడు. రైల్వే స్టేషన్ లో కుమార్ గంజాయితో ఉండగా, పక్క సమాచారంతో రంగప్రవేశం చేసిన యాంటీ డ్రగ్స్ టీం  తనిఖీలు చేసి పట్టుకొన్నారు. నిందితుడు ఇచ్చిన వివరాలతో మేడపైన పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని... నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)

Here's Video:

పోలీసుల విజ్ఞప్తి

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయిస్తే, లేదా గంజాయి మొక్కలను పెంచినా తక్షణమే వారికి సమాచారం అందించాలని పోలీసులు స్థానికులకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ‌ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement