Telangana: సివిల్ వ్యవహారంలో తలదూర్చిన ఎస్‌ఐ బొరగాల అశోక్.. బాధితుడిని బండబూతులు తిట్టిన వైనం, ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని కమిషనర్ ఆదేశం

సివిల్ విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నారు మొగుళ్ళపల్లి ఎస్ఐ(SI Boragala Ashok). ఒక వ్యక్తికి మద్దతుగా భూమి వదలాలని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లం* కొడకా అంటూ బూతులు తిడుతూ.. వేధింపులు

Mogullapalli SI enters civil matter, Commissioner orders enquiry(X)

Hyd, Feb 1:  సివిల్ విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నారు మొగుళ్ళపల్లి ఎస్ఐ(SI Boragala Ashok). ఒక వ్యక్తికి మద్దతుగా భూమి వదలాలని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లం* కొడకా అంటూ బూతులు తిడుతూ, వేధింపులకు పాల్పడ్డాడు ఎస్ఐ బొరగాల అశోక్.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో పిన్నింటి రాజేశ్వర్ రావు అనే వ్యక్తి పొలానికి దారి కోసం బల్గూరి సంపత్ రావును భూమి వదలాలని వేధింపులకు గురిచేస్తున్నాడు మొగుళ్ళపల్లి ఎస్ఐ బొరగాల అశోక్.

తాతల నాటి నుంచి వస్తున్న సొంత భూమిని ఇవ్వలేమన్న బల్గూరి సంపత్ రావును నవంబర్ 7వ తేదీన బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి భూమి ఇవ్వాలని బెదిరించి, బూతులు తిట్టాడు ఎస్ఐ బొరగాల అశోక్.

సివిల్ విషయంలో దూరి తమను బెదిరిస్తున్నాడని, తమకు ప్రాణభయం ఉందని ఎస్ఐ అశోక్‌పై డీజీపీకి, జయశంకర్ భూపాలపల్లి కమిషనర్ కిరణ్ కరేకు ఫిర్యాదు చేసిన సంపత్ రావు కుమారుడు శశిధర్ రావు.. ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని సీఐను ఆదేశించిన కమిషనర్ కిరణ్ కరే. వీడియో ఇదిగో, దారిలో వేధించిన పోకిరిని పట్టుకుని చితకబాదిన యువతి, భార్యకు చేయి అందించిన వికలాంగుడైన భర్త

దీంతో పిన్నింటి రాజేశ్వర్ రావు అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి, ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా సంపత్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టాడు ఎస్ఐ అశోక్.

మళ్లీ నిన్న బల్గూరి సంపత్ రావును పోలీస్ స్టేషన్‌కు పిలిచి నీ మీద కేసు నమోదైంది.. నీ కొడుకు రూల్స్ మాట్లాడుతున్నాడు, ఏం అనుకుంటున్నాడు. దారికి భూమి ఇస్తావా, నీ సంగతి చూడాలా లం* కొడకా అంటూ బూతులు తిట్టి, పోలీస్ స్టేషన్ లో 4 గంటలు కూర్చోబెట్టాడు ఎస్ఐ అశోక్. ఎస్ఐ తమను తీవ్రంగా వేధిస్తున్నాడని, తమకు ప్రాణభయం ఉందంటూ సంపత్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement