Munugode Bypoll 2022: పోటెత్తిన ఓటరు.. మునుగోడులో ముగిసిన పోలింగ్.. మొత్తంగా 93.13 శాతం పోలింగ్ నమోదు.. 2018లో జరిగిన ఎన్నికల్లో నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ..

మునుగోడులో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 93.13 శాతం పోలింగ్‌ నమోదైంది. 2018లో జరిగిన ఎన్నికల్లో నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ.

Polling (Credits: ANI)

Munugode, Nov 4: మునుగోడులో (Munugode) పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ (Polling) కొనసాగింది. మొత్తంగా 93.13 శాతం పోలింగ్‌ నమోదైంది. 2018లో జరిగిన ఎన్నికల్లో (Elections) నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. కాగా మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,41,805.

మునుగోడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఆ పార్టీదే విజయమట.. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ లో ఏ ఏజెన్సీ ఏం చెప్పింది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి??

గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగింది. ప్రచారం పర్వంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పాల్వాయి స్రవంతి అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement