Delhi, Feb 5: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది(Delhi Election 2025 Updates). మధ్యాహ్నం 1 గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇక సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు(Delhi Polling Updates).
రాజ్‌నివాస్ మార్గ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. కాల్‌కాజీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ.
ఢిల్లీ నిర్మాణ్‌భవన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. లేడీ ఇర్విన్ స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal). తల్లిదండ్రులను వీల్ చైర్‌లో పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు . నిర్మాణ్ భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ.
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కా గా రాత్రి 6 గంటల వరకు 13,766 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ కొనసాగనుంది. పోలింగ్ సందర్భంగా ఆప్ ఎంపీ సంజయ్(Sanjay Singh) సింగ్ .. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటింగ్ రోజున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. వాల్మీకి సామాజిక వర్గంతో మీకు ఎందుకింత శత్రుత్వం? అని ప్రశ్నించారు. వీడియో ఇదిగో, పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ, నేటి వరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు
ఇక జాకీర్ హుస్సేన్ కాలేజీ వద్ద ఆప్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు, పారామిలటరీ బలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను పరిశీలిస్తే న్యూఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్ (AAP)- ప్రవేష్ వర్మ (BJP) - సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) బరిలో ఉన్నారు. కాల్కాజీ నుండి సీఎం ఆతిషి (AAP) vs రమేష్ బిధురి (BJP) - అల్కా లాంబా (కాంగ్రెస్) బరిలో ఉండగా జంగ్‌పురా నియోజకవర్గం నుండి మనీష్ సిసోడియా (AAP)- తరవిందర్ సింగ్ మార్వా - vs ఫర్హాద్ సురి (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్ పాసవాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి.