New Delhi, Feb 5: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) నేటితో 24వ రోజుకు చేరింది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాను సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఆయన త్రివేణీసంగమంలో వేద మంత్రాల నడుమ పవిత్ర స్నానం ఆచరించారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలన్న తన నిశ్చయానికి అనుగుణంగా ప్రధానమంత్రి పవిత్ర క్షేత్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారని ప్రధాని కార్యాలయం తెలిపిన సంగతి విదితమే. గత సంవత్సరం డిసెంబరు 13న ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి రూ.5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక సమాగమమైన మహా కుంభమేళా గతనెల 13న పుష్య పూర్ణిమనాడు ప్రారంభమైంది. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం వరకూ ఈ ఉత్సవం కొనసాగుతుంది.
Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam
#WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
(Source: ANI/DD)
#KumbhOfTogetherness #MahaKumbh2025 pic.twitter.com/kALv40XiAH
— ANI (@ANI) February 5, 2025
Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
(Source: ANI/DD)#MahaKumbh2025 pic.twitter.com/gfXuw352yN
— ANI (@ANI) February 5, 2025
#WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
(Source: ANI/DD)#KumbhOfTogetherness pic.twitter.com/a0WAqkSrDb
— ANI (@ANI) February 5, 2025
జనవరి 13న కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకూ 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఇక ఇవాళ ఉదయం 37 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు. అందులో 10 లక్షల మంది కల్పవాసీలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.