Hyderabad Horror: హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.

Hyderabad Horror (Credits: X)

Hyderabad, Sep 16: హైదరాబాద్‌ (Hyderabad) లో గచ్చిబౌలిలోని రెడ్‌ స్టోన్‌ హోటల్‌ లో (Redstone Hotel) దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. మృతురాలిని జడ్చర్లకు చెందిన శృతిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు గతంలో యశోద హాస్పిటల్‌ లో పనిచేసినట్లు గుర్తించారు. కాగా నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆమె ప్రస్తుతం జాబ్ సెర్చింగ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌ కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!

రేప్ చేసి చంపేశారంటూ..

తమ కుమార్తెను రేప్ చేసి చంపేశారంటూ శృతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif