Omicron in Telangana: కేసులు పెరిగినా ఎలాంటి లాక్‌డౌన్ ఉండదు, తెలంగాణలో మరొకరికి ఒమిక్రాన్, 8కి చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య, కరోనా మూడో దశ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న సర్కారు
తెలంగాణలో కొత్తగా ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయిందని దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి (Omicron in Telangana) చేరిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసంరం లేదని, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కొత్తగా హనుమకొండలో మహిళకు ఒమైక్రాన్ (One more omicron cases traced) నిర్థారించామని చెప్పారు
Hyd, Dec 17: తెలంగాణలో కొత్తగా ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయిందని దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి (Omicron in Telangana) చేరిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసంరం లేదని, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కొత్తగా హనుమకొండలో మహిళకు ఒమైక్రాన్ (One more omicron cases traced) నిర్థారించామని చెప్పారు
ప్రపంచంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ (omicron) వల్ల ఒక్క మరణమే సంభవించిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కరోనా మూడో దశ విజృంభణ ఎదురైతే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. భవిష్యత్తులో మరో 10 కొత్త కరోనా వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమని ఆయన చెప్పారు. ఒమిక్రాన్‌ను కరోనా నుంచి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇంట్లో, బయట మాస్కులు ధరించాలని ఆయన చెప్పారు.
తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు
ఒమైక్రాన్ బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. డెల్టా కంటే 8 రెట్లు ఎక్కువగా ఒమైక్రాన్ వ్యాప్తి ఉంటుందన్నారు. గతంలో కరోనా వచ్చిన వాళ్లకూ ఒమైక్రాన్ వస్తోందని తెలిపారు. రెండు డోస్‌లు తీసుకున్నవారికీ ఒమైక్రాన్ వస్తోందని అన్నారు. కాగా తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. లాక్‌డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని ఆయన సూచించారు. తెలంగాణలో 97 శాతం మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 100 శాతం మంది తొలి డోసు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, 56 శాతం మంది రెండో డోసూ తీసుకున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒమిక్రాన్‌పై జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ర్యాండమ్‌గా తాము కరోనా పరీక్షలు చేస్తున్నామని వివరించారు. అందులో భాగంగానే ఒమిక్రాన్ కేసులను గుర్తించామని, దాన్ని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో వెల్లడైన ఎనిమిది ఒమిక్రాన్ కేసుల్లో ఏడు కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారివేనని చెప్పారు.