Free Ambulance Services: రాచకొండ పరిధిలో ఉచిత అంబులెన్స్ స‌ర్వీసులు, నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్, హెల్ప్‌లైన్ నంబర్ 9490617234 లో సంప్రదించాలని సూచన

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బుధ‌వారం ప్రారంభించారు. టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్మార్ట్ఐఎంఎస్‌ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. మెడికల్ చెకప్‌కు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు రోజులో ఎప్పుడైనా ఈ సేవలను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌న్నారు.

Rachakonda Police Commissioner Mahesh Bhagwat launched Free ambulance services (Photo-Twitter)

Hyderabad, April 28: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బుధ‌వారం ప్రారంభించారు. టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్మార్ట్ఐఎంఎస్‌ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. మెడికల్ చెకప్‌కు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు రోజులో ఎప్పుడైనా ఈ సేవలను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌న్నారు.

ఆక్సిజన్, వెంటిలేషన్, ఇతర అత్యవసర సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లను అందిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, వికలాంగులు ఈ సేవలను ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలు, బ్ల‌డ్ బ్యాంకుల‌ను సందర్శించేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చు.

రాచకొండ కమిషనరేట్ ప‌రిధిలో వచ్చే రెండు నెలలు ఈ అంబులెన్సులు క్రీయాశీల‌కంగా అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు చెప్పారు. కొవిడ్ -19 నుండి ప్ర‌జ‌లు తమను తాము రక్షించుకోవడానికి మాస్కు ధరించడం, శానిటైజర్‌ను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

నాన్ కొవిడ్ -19 వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు రాచకొండ కొవిడ్ కంట్రోల్ హెల్ప్‌లైన్ నంబర్ 9490617234 ను సంప్రదించవచ్చు అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను పొందటానికి స్టాన్‌ప్లస్ హాట్‌లైన్ నంబర్ 1800 – 121911911 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement