Siddipet Car Accident: వీడియో ఇదిగో.. సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు, దంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి
సిద్దిపేట జిల్లాలో అత్యంత తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది.
Siddipet Car Accident: సిద్దిపేట జిల్లాలో అత్యంత తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది.
దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), తన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)లతో కలిసి సిద్దిపేట నుంచి తమ స్వగ్రామానికి కారులో బయలుదేరారు. అప్పనపల్లి శివారులోకి రాగానే కారు అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సహాయంతో బావిలో నుంచి కారును, నలుగురి మృతదేహాలను వెలికితీశారు.
Siddipet Tragedy: Car Falls into Well, Couple and Two Children Die
అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బలవంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో శోకసంద్రం అలుముకుంది.