Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు, డిసెంబర్ 9 నుంచి సభాసమరం మొదలు
ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, కులగణన వివరాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ సమావేశాల్లో.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ భావిస్తోంది
Hyderabad, DEC 01: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, కులగణన వివరాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ సమావేశాల్లో.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అటకెక్కించడంపై ఆసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది.
రైతు భరోసా విధివిధానాలపై అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఒక ప్రకటన చేశారు. కులగణన వివరాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన తనకు సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ప్రకటించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement