Telangana: సీన్ రివర్స్ బాసూ, రూ. 2 లక్షల కట్నం సరిపోలేదని గంట ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన వరుడు కుటుంబం

హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వరుడు కుటుంబం ఇచ్చిన కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది.

Representational Image (Photo Credits: unsplash.com)

Hyd, Mar 10: హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వరుడు కుటుంబం ఇచ్చిన కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మునిసిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.

అమ్మాయికి రూ. 2 లక్షల కట్నం ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. గత రాత్రి 7.21 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వివాహ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే అనుకున్న సమయానికి పెళ్ళి కూతురు రాకుండా షాకిచ్చింది. తనకు రూ. 2 లక్షల కట్నం సరిపోదని, అదనంగా మరింత ఇస్తేనే వివాహం జరుగుతుందని వధువు తేల్చి చెప్పింది.

టీ వేడిగా లేదని కోడలిపై అరిచిన అత్త, కోపంతో రాడ్డు తీసుకుని అత్త తల పగలగొట్టిన కోడలు, తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగులోకి ..

దీంతో షాకయిన వరుడు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు యువతి తరపు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement