Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్,ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత,వ్యవసాయానికి పెద్దపీట
నా తెలంగాణ కోటీ రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 సందర్భంగా మాట్లాడిన భట్టి, తెలంగాణ వస్తేనే బ్రతకులు బాగుపడతాయని ప్రజలు ఆందోళన చేశారన్నారు.
Hyd, July 25: నా తెలంగాణ కోటీ రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 సందర్భంగా మాట్లాడిన భట్టి, తెలంగాణ వస్తేనే బ్రతకులు బాగుపడతాయని ప్రజలు ఆందోళన చేశారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలను గత పాలకులు పలికారన్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. తెలంగాణ అప్పు 6 లక్షల 72 వేల కోట్లకు చేరిందన్నారు. గత పది సంవత్సరాల్లో తెలంగాణ అప్పు పదిరేట్లు పెరిగిందన్నారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం అన్నారు. సాగునీటి రంగం కేటాయింపుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల సాగునీటి రంగంలో ఆశీంచిన అభివృద్ధి జరగలేదన్నారు. అందుకే రైతుల సాగునీటి సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయిందన్నారు. ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రస్తుత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
గత పాలకులు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఫలితంగా అప్పుల కుప్పగా మారిందన్నారు. కనీసం ఉద్యోగులు వేతనాలు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి అప్పులు తీసుకున్న పరిస్థితి నెలకొందన్నారు.కుంటుపడిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులు, పెన్షన్ దారులకు ప్రతినెల ఒకటో తారీఖునే జీతాలు, పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.
తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. వాస్తవానికి దగ్గరగా తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం నడుస్తోందన్నారు. తాము ఇచ్చిన హామీలు ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు కావని ప్రజల గుండెల్లో నుండి వచ్చిన హామీలు అన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉంది ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్న గులాబీ నేతలు, షెడ్యూల్ ఇదే
బడ్జెట్ హైలైట్స్..
()రూ.2,91,159 కోట్లతో వార్షిక బడ్జెట్
()రూ,2,20,945 కోట్ల రెవెన్యూ వ్యయం
()రూ.33,487 కోట్ల మూలధన వ్యయం
()సాగునీటి శాఖకు రూ.26 వేల కోట్లు
()31 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం
()నిరుపేద కూలీలకు ఈ ఏడాది నుండి రూ.12 వేలు
()వ్యవసాయ రంగానికి రూ.72 ,659 కోట్లు
()గృహజ్యోతి స్కీంకు రూ. 2,418 కోట్లు
()గ్యాస్ సబ్సిడీ స్కీంకు రూ.723 కోట్లు
() సివిల్ సప్లై కోసం రూ.3836 కోట్లు
()పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,816 కోట్లు
()మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
()హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు
()మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు
()పశుసంవర్ధక రంగానికి రూ.1980 కోట్లు
(0విద్యుత్ శాఖకు రూ,16,410 కోట్లు
()ఆరోగ్య, వైద్య శాఖకు రూ. 11,468 కోట్లు
()మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు
()పరిశ్రమల శాఖకు రూ.2736 కోట్లు
()ఎస్సీ సంక్షేమం కోసం రూ, 33,124 కోట్లు
()ఎస్టీ సంక్షేమం కోసం రూ.17,056 కోట్లు
()స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ. 2736 కోట్లు
()బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు
()నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు
()హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు
()మహిశా శక్తి క్యాంటీన్లకు రూ. 50 కోట్లు
()ఉచిత రవాణా రూ.723 కోట్లు
()జీహెచ్‌ఎంసీకి రూ.3000 కోట్లు
()హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు
()ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836 కోట్లు
()మెట్రో వాటర్ రూ. 3385 కోట్లు
()హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు
()ఏయిర్ పోర్టుకు మెట్రో రూ.100కోట్లు
()ఓఆర్ ఆర్ కురూ.200కోట్లు
()హైదరాబాద్ మెట్రో కు రూ.500కోట్లు
()ఓల్డ్ సిటీ మెట్రోకు రూ. 500కోట్లు
()అడవులు, పర్యావరణం కు రూ.1064 కోట్లు
()ఐటీ శాఖకు రూ. 774కోట్లు
()హోంశాఖకు రూ. 9564 కోట్లు
()ఆర్ అండ్ బి శాఖకు రూ. 5790 కోట్లు
()రీజనల్ రింగ్ రోడ్డుకు రూ. 1525 కోట్లు
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)