medigadda barrage(Video Grab)

Hyd, July 25: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటికి పెద్దపీట వేస్తూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనేక బ్యారేజ్‌ల్లో ఒకటి మేడిగడ్డ. ఇక బీఆర్ఎస్ ఓటమి తప్ప తర్వాత మేడిగడ్డ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని దానికి నిదర్శనం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమేనని ప్రజల ముందు ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే దీనిని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మేడిగడ్డ బ్యారేజ్ నిండుకుండలా మారింది. వాటర్ స్టోరేజ్ కూడా కావడంతో ఇది ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటన చేపట్టారు.

ఇవాళ బడ్జెట్ అనంతరం నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌తో పాటు కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల్లో కన్నెపల్లి పంప్‌హౌస్‌, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించి ప్రజలకు వాస్తవాలను వివరించనున్నారు.

ఇవాళ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు శామీర్‌పేట‌లో లంచ్ చేసి అనంతరం లోయ‌ర్ మానేరు డ్యాం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. సాయంత్రం 5 గంట‌ల‌కు క‌రీంన‌గ‌ర్‌లోని లోయ‌ర్ మానేరు డ్యాంను ప‌రిశీలించ‌నున్నారు. అనంతరం రామగుండంలో బసం చేయనున్నారు. ఇక శుక్రవారం ఉదయం క‌న్నెప‌ల్లి పంప్ హౌస్‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. అక్కడ క‌న్నెప‌ల్లి పంప్ హౌస్‌ను ప‌రిశీలించిన అనంత‌రం మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. సహనం కొల్పోయిన సీఎం నితీష్ కుమార్, మహిళా ఎమ్మెల్యేపై సీరియస్, నువ్వు స్త్రీవి, నీకు ఏమీ తెలియదు?అంటూ మండిపాటు