IPL Auction 2025 Live

Copying In Group 1 Exam: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్.. చీర కొంగులో చిట్టీలతో పాటు చేతి మీద కొన్ని జవాబులు రాసుకొనివచ్చిన మహిళా అభ్యర్థి.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.

Copying In Group 1 Exam (Credits: X)

Hyderabad, Oct 26: గ్రూప్-1 మెయిన్స్ (Group 1 Mains) పరీక్షలో కాపీయింగ్ (Copying In Exam) జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు. చీర కొంగులో చిట్టీలను, చేతిపై రాసుకొచ్చిన కొన్ని రాతలతో ఉన్న ఆమెను ఇన్విజిలేటర్ పట్టుకొన్నారు. మహబూబ్ నగర్ లోని పెద్దామామిడి మండలం గట్ల కానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి.. ఎస్జీటీ  టీచర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మాస్ కాపీయింగ్ పై పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటన విడుదల చేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు

ప్రకటనలో ఏమున్నదంటే?

‘సీవీఆర్ ఎగ్జామ్ సెంటర్ లో మహిళా అభ్యర్థి  లక్ష్మి అనుమానాస్పదంగా కనిపించింది. తన ఎడమ చేతి మీద కొన్ని జవాబులు రాసుకొని ఆమె వచ్చింది. దీంతో సదరు మహిళా అభ్యర్థిని ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన మహిళా అభ్యర్థి మీద మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశాం’ అని పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెల్లడించింది.

మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ భీభత్సం.. వీడియో వైరల్