CM Revanth Reddy On BRS: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, కేసీఆర్ గవర్నర్ అవుతారన్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఏ పదవో తెలుసా?

బీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్..మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు.

Telangana CM Revanth Reddy sensational comments on BJP - BRS Merger

Delhi, Aug 16: బీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్..మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు.

ఆలస్యమైన బీజేపీలో బీఆర్ఎస్ ఎప్పటికైనా విలీనం కావాల్సిందేనని చెప్పారు. ఇక విలీనం తర్వాత బీఆర్ఎస్ నేతలకు వచ్చే పదవులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రేవంత్. గవర్నర్‌గా కేసీఆర్‌, కేంద్రమంత్రిగా కేటీఆర్, రాజ్యసభకు కవిత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి హరీష్ రావుకు దక్కుతుందన్నారు. దీంతో రేవంత్ ఇప్పుడు ఢిల్లీలో చేసిన కామెంట్స్‌ తెలగాణ రాజకీయాల్లో కాక పుట్టించాయి.

వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ నడుస్తోంది. వరుసగా ఎన్నికల్లో ఓటములు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు వెరసీ సంక్షోభంలో ఉంది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా లేకపోవడం ఇదే తొలిసారి. రాజ్యసభలో మాత్రం నలుగురు సభ్యులు బీఆర్ఎస్‌కు ఉన్నారు. మీ విజన్‌ అద్భుతం..సీఎం రేవంత్‌రెడ్డికి ఫాక్స్ కాన్ సీఈవో కితాబు, త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తా, పెట్టుబడులు పెడుతానని వెల్లడించిన యంగ్ లియూ

Here's Tweet:

 ఈ నేపథ్యంలోనే ఇటీవల కేటీఆర్ - హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. దీంతో బీజేపీ- బీఆర్ఎస్ విలీనంపై వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఖండించిన కేటీఆర్...తప్పుడు ప్రచారం చేసే సంస్థలు, పేపర్లపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటూ బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ సైతం తాము పేపర్‌లోనే చదివామని చెప్పారు. దీంతో బీజేపీ - బీఆర్ఎస్ విలీనం వార్తలకు చెక్ పడగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌తో మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement