Telangana: భార్యా పిల్లలకు పురుగుమందు ఇచ్చి తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త, నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన, వ్యాపారంలో నష్టాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు

నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కపిల హోటల్‌లో ఓ కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్గారు. మృతులను ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్‌ (10)గా గుర్తించారు.

Suicide Representative Image (Photo Credits: File Photo)

Nizamabad, August 21: నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కపిల హోటల్‌లో ఓ కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్గారు. మృతులను ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్‌ (10)గా గుర్తించారు. మృతులంతా గత రెండువారాలుగా హోటల్‌లోనూ ఉంటూ వస్తున్నారు. అయితే, తల్లీ ఇద్దరు పిల్లలు పురుగుల మందు తాగారు. సూర్యప్రకాశ్‌ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అయితే, సూర్యప్రకాశ్‌ మొదట భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి.. ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూర్యప్రకాశ్‌ హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

పబ్‌జీ ఓడిపోయాడని గేమర్ ఆత్మహత్య, ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న బీహార్ వాసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వ్యాపారంలో నష్టాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడా?.. ఇంకా ఏమైన సమస్యలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement