Telangana Horror: వికలాంగుడిని కూడా వదలని కామాంధులు, రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి 5 మంది గ్యాంగ్ రేప్, ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులు, మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన

ఓ మానసిక వికలాంగుడిపై ఐదుగురు కామాంధులు లైంగిక దాడికి (physically challenged person gang raped) పాల్పడ్డారు.అంతే కాకుండా ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఇందారంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Mancherial, Oct 10: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన (Telangana Horror) చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగుడిపై ఐదుగురు కామాంధులు లైంగిక దాడికి (physically challenged person gang raped) పాల్పడ్డారు.అంతే కాకుండా ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఇందారంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన మానసిక వికలాంగుడైన యువకుడిపై అదే గ్రామానికి చెందిన చెందిన గడ్డం నందు, కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్, మహ్మద్‌ సాధిక్, బొగె రాయలింగు కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ వేంధిపులకు గురిచేస్తున్నారు. మోటార్‌సైకిల్‌పై రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా హింసించి ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవారు. సదరు యువకుడు అనారోగ్యానికి గురి కావడంతో విషయం బయటపడింది. యువకుడి తల్లిదండ్రులు శనివారం చెన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.

డ్రగ్స్ మత్తులో హెచ్ఐవి కొని తెచ్చుకున్న 85 మంది ఖైదీలు, నాగావ్ సెంట్రల్ జైలు, స్పెషల్ జైలులో షాకింగ్ ఘటన, డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఒకే సిరంజీ వాడటంతో సోకిన వైరస్

ఇక సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు (17) శనివారం రాత్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో మొదట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడి నుంచి సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ నివాసం సమీపంలోని బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకుని గది తలుపులు బద్ధలు కొట్టారు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.



సంబంధిత వార్తలు

ED Notices To KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు.. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌