MLC Kavitha: నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని కామెంట్

నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నాని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). జలాలపై రాజకీయం చేయడం మానేసి ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Telangana Jagruthi roundtable meeting on ‘Water Facts’(ANI)

Hyd, Jan 31:  నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నాని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). జలాలపై రాజకీయం చేయడం మానేసి ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ జలవనరులు, ప్రాజెక్టలపై “నీళ్లు ‌- నిజాలు” అనే అంశంపై తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) సంస్థ శుక్రవాం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) మేరునగధీరుడిలా నిలబడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతజ్ఞతను ప్రదర్శించాలని... సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్ లా పనిచేస్తున్నారు అని దుయ్యబట్టారు. కేసీఆర్(KCR) పై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే కాకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బురదరాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని అన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy(కి బహిరంగ లేఖ రాశారు.

కేసీఆర్ శతృవు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.. కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శతృవులని ఆయన గమనించాలి అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర కేడర్ లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ ను ఇరిగేషన్ సలహదారు పదవి నుంచి తొలగించాలని, కృష్ణ ట్రైబ్యునల్ లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి మన జలాలను తరలించారు. అదే ఒరవడిని జగన్, చంద్రబాబు కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే... ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలను మోహరింపజేశారు. కృష్ణా జలాల దోపిడీని ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఎస్, జగన్ కొనసాగించారు. ఇప్పుడు గోదావరి నదిపై కూడా ఆంధ్రా నాయకుల కన్ను పడింది. రాష్ట్రంలో తెలంగాణ సోయితో పరిపాలనం జరగడం లేదు.” అని వ్యాఖ్యానించారు. నేను కొడితే మామూలుగా ఉండదు.. గంభీరంగా చూస్తున్న, కార్యకర్తలతో కేసీఆర్, ప్రాణం పోయినా తెలంగాణ కోసం కోట్లాడుదాం అని పిలుపు

కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారిందని, ఎంతో మంది మేధావుల, ఇంజనీర్ల కృషి ఫలతమే అనేక ప్రాజెక్టుల నిర్మాణమని తెలిపారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లామని, కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విర్మిస్తున్నదని విమర్శించారు.

మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకొని 15 లక్షల ఎకరాలకు నీళ్లించుకోవడం జరిగిందని, కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నామని అన్నారు. అందుకు సాక్ష్యం తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే... 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండిందని, వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగిందని స్పష్టం చేశారు. ఇన్ని చేసినా పదేళ్లలో ఏమి జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారని, కానీ తెలంగాణ మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఎండగట్టారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారని, నీళ్లు ఇవ్వక రైతుల పొట్టకొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదని చెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement